Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.24 కోట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈరోజు శ్రీ వేంకటేశ్వరస్వామిని 34,689 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ్టి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.24 కోట్లు.

More Telugu News